రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ధర పెరిగింది

  • In Money
  • February 7, 2019
  • 220 Views
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  ధర పెరిగింది

చెన్నై: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొన్ని మోడల్స్‌ వాహనాలపై ధరలను పెంచింది. పెంచిన ధరలు ఈ నెల నుంచి అమల్లోకి వచ్చాయి. 350 సీసీ – 500సీసీ మధ్య మోడళ్లపై రూ.1500 వందల వరకు ధర పెరిగింది. బుల్లెట్‌ 350, 500, క్లాసిక్‌ 350, 500 , హిమాలయన్ మోడళ్లపై ధరలను పెంచింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.కొత్త ధరల ప్రకారం బుల్లెట్‌ 350 ధర రూ.1.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్లాసిక్‌ ధర 350 ఏబీఎస్‌ ధర రూ.1.53లక్షల నుంచి మొదలవుతుంది. క్లాసిక్‌ 350 ఏబీఎస్‌ సిగ్నల్స్‌‌ ఎడిషన్‌ కూడా ధర పెరిగి రూ.1.63లక్షలకు చేరింది. హిమాలయన్‌ ఏబీఎస్‌ ఎడిషన్‌ 1.80లక్షల నుంచి మొదలవుతుంది. ధర పెంపునకు గల కారణాలను ఎన్‌ఫీల్డ్‌ వివరించలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరగటమే దీనికి కారణమని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos