న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు అనుమతించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు రాఫెల్ అవినీతిపై చర్చకు పట్టుపట్టారు. రాఫెల్ వ్యవహారంపై సంయుక్త సభా సమితిని నియమించాలని సభ్యులు విన్నవించారు. ముందుగా రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుందని
వెంకయ్యనాయుడు చెప్పారు. అందుకు ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. గందరగోళం సృష్టించారు. సభను సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను సోమవారం నాటికి వాయిదా వేసారు.