ఢిల్లీ: రాజ్యసభలో ఈబీసీ బిల్లును కేంద్రమంత్రి గెహ్లాట్ ప్రవేశపెట్టారు. బిల్లుపై విపక్షాల ఆందోళనకు దిగాయి. పోడియం వద్ద విపక్ష సభ్యుల ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. ప్రజలను మోసం చేయడం ఆపాలంటూ విపక్షాల నినాదాలతో హోరెత్తించాయి. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే, సీపీఐ డిమాండ్ చేశాయి. బిల్లుపై తొందరెందుకుని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఎన్నికల గిమ్మిక్కుగా ఈబీసీ బిల్లును అభివర్ణించింది. రాజ్యసభలో మొత్తం 244 మంది సభ్యుల్లో బీజేపీకి 73 మంది, కాంగ్రెస్‌కు 50 మంది సభ్యుల బలం ఉంది.