రాజకీయ ఎంట్రీపై అజిత్

  • In Film
  • January 22, 2019
  • 983 Views
రాజకీయ ఎంట్రీపై అజిత్

తమిళనాట స్టార్ హీరోలంతా ఎప్పటి కైనా రాజకీయాల్లో కి వెళ్లాల్సిందే. ఎంజీఆర్ – జయలలిత – కరుణానిధి ఇలా అందరూ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. రజనీకాంత్ – కమల్హాసన్ కూడా రాజకీయాల్లో తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రజనీ – కమల్ తర్వాత ఆ స్థాయి స్టార్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్న హీరో అజిత్. ఇంకా చెప్పాలంటే మనకు తెలుగులో పవర్స్టార్ పవన్కల్యాణ్ ఎలాగో అక్కడ అజిత్ అలా. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దీంతో.. అజిత్ పై రాజకీయ పార్టీల కళ్లు పడ్డాయి.జయలలిత పోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీకి మగదిక్కు లేకుండా పోయింది. సరైన సినిమా వాళ్లు లేక స్టార్డమ్ కూడా తగ్గింది. దీంతో.. అజిత్ని తమ పార్టీలోకి ఆహ్వానించాలని అన్నాడీఎంకే ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. అజిత్ వస్తే తమ పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందనేది ఆ పార్టీ ఆశ. అదీగాక.. గతంలో తన వారసుడిగా ఇండస్ట్రీ నుంచి మీరు ఎవర్ని అహ్వానిస్తారు అని జయలలితను అడిగితే ఆమె అజిత్ పేరే చెప్పారు. అయితే.. తమకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు అజిత్. తనకు సాధారణంగా జీవించడమే ఇష్టమని.. అందుకే ప్రాణం ఉన్నంతవరకు రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పేశాడు. అన్నింటికి మించి తనకు సాధారణ పౌరుడిలా క్యూలో నించుని ఓటు వేయడమే ఇష్టమని చెప్పాడు. రీసెంట్గా అజిత్ విశ్వాసం సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్హిట్ అయ్యింది. త్వరలో తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos