యోగి స్నానం చేసిన గంగా జలాలను శుద్ధి చేయాలి’

యోగి స్నానం చేసిన గంగా జలాలను శుద్ధి చేయాలి’

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయోగరాజ్ కుంభమేళాలో చేసిన పవిత్రస్నానంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. శశిథరూర్ వంటి విద్యాధికుడు హిందూ సంప్రదాయలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. యోగి ఆదిత్యనాథ్ తన మంత్రులతో కలిసి గంగాస్నానం చేస్తున్న ఫోటోను ట్వీచ్ చేసిన శశిథరూర్ ఆ ఫోటో కింద ‘గంగను కూడా ప్రక్షాళనం చేయాలి. వారు చేసిన పాపాలు నది నుంచి కొట్టుకుపోవాలి. ఈ సంగంలో ప్రతి ఒక్కరూ నగ్న సాధువులే. గంగా మాతాకు జై’ అంటూ క్యాప్షన్ కూడా తగలించింది. శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లి మండిపడ్డారు. శశిథరూర్ వంటి గౌరవనీయ వ్యక్తి హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు కామెంట్లతో ప్రచారంలో ఉంటుండటం విచారకరమని అన్నారు. ‘ఆయన ట్వీట్‌ను ఇస్లాం, క్రిస్టియన్, లేదా ఇతర మతాల నమ్మకాలు, పద్ధతులకు సంబంధించినవిగా ఎవరూ చూడరు. ఆయన ఇలా ఎందుకు చేస్తుంటారు? కుంభమేళాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఎవరూ సూటు, టై ధరించి వెళ్లరు. పవిత్ర దినం కావడంతో యోగి, ఆయన మంత్రులు సంఘం ఘాట్‌లో స్నానాలు చేశారు. ఇతరులను కూడా శశిథరూర్ గౌరవించడం నేర్చుకోవాలి’ అని కోహ్లి అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం త్వరలోనే ప్రయాగరాజ్‌లో పవిత్ర స్నానాలు చేయబోతున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos