పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాది కాలం పాటు సాన్నిహిత్యంగా మెలిగి పెళ్లి మాటెత్తగానే ముఖం చాటేస్తుండడంతో వైద్యుడు ఆదర్శ్‌పై ఆమ్లంతో దాడి చేసినట్లు నర్సు అరుణ తెలిపారు.ఆమ్లంతో దాడి చేసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించగా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్న అరుణ మధ్యాహ్నం సమయానికి కొద్దిగా కోలుకోవడంతో మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం తిరుపతి నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తూ అనారోగ్యంతో బాధ పడుతున్న భర్తను చూసుకుంటూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నాన్నారు.తన పరిస్థితిని ఆసరాగా తీసుకున్న వైద్యుడు ఆదర్శ్ ప్రేమిస్తున్నానని తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడన్నారు.దీంతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న భర్తను చంపాలని కూడా సూచించడంతో అందుకు నాచేతనే ఇంజెక్షన్ ఇప్పించి తన తన చేతులతోనే భర్తను హత్య చేయించాడని తెలిపారు.ఇది గడిచిన అనంతరం ఏడాదిపాటు సహజీవనం చేసిన అనంతరం పెళ్లి చేసుకోమని అడగగా ముఖం చాటేసాడన్నారు.దీనిపై అప్పట్లోనే తూర్పు విభాగ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసామన్నారు.అయినప్పటికీ ఆదర్శ్ తీరులో మార్పు రాకపోవడంతో ఆదర్శ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూడసాగానన్నారు.ఈ క్రమంలో భార్యతో విడాకుల వ్యవహారానికి సంబంధించి వాయిదా కోసం కోర్టుకు వస్తున్నట్లు తెలియడంతో నడిరోడ్డులోనే చెప్పుతో దాడి చేసి అనంతరం ఆమ్లం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నామన్నారు.అయితే తనను చూసిన ఆదర్శ్ పారిపోవడానికి యత్నించడంతో ఆమ్లంతో దాడి చేసానని అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించానన్నారు.నాతో పాటు ఆదర్శ్ మరో ఐదుమందిని మోసం చేసాడని అటువంటి వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసారు..