న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ. ఈనెల 27న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజు పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొనాల్సి ఉండటంతో పర్యటన వాయిదా పడినట్లుప్రధానమంత్రి కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈనెల 10న గుంటూరు జిల్లాలోజరగనున్న మోదీ పర్యటనకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.