మొరాయించిన “వందే భారత్ “

మొరాయించిన  “వందే భారత్ “

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్‌ రహిత సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’‌పరుగు ప్రారంభించిన రెండో రోజూ ముందుకు కదల కుండా మొరాయించింది. దీన్ని  ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లాంఛనంగా ఆరంభించారు. ఢిల్లీ- వారణాసి మధ్య మాత్రమే ఇది నడుస్తోంది. వారణాసి నుంచి ఢిల్లీకి శనివారం ఉదయం బయలుదేరిన ఈ రైలు. బ్రేకుల్లో  లోపం వల్ల చమ్రోలా స్టేషన్‌లో నిలిపివేశారు.  శనివారం ఉదయం 5.30 గంటలకు వారణాసి నుంచి రైలు బయలుదేరిన మూడు గంటల తర్వాత నాలుగు కోచ్‌లలో బ్రేకులు బిగుసుకు పోవటంతో పెద్ద శబ్దం వచ్చింది. సమస్యను గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను మరో రైలులో తరలించారు. రైలు ఓ ఆవును ఢీకొట్టడంతో చక్రాలకు దాని మృతదేహం చుట్టుకోవడంతో బ్రేకులు పట్టేశాయని  గుర్తించారు. భోగీల్లో నుంచి పొగలు రావడంతో విద్యుత్ సర్క్యూట్‌‌ అయినట్టు మొదటం అనుమానించారు. రైల్వే ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు మాత్రమే అప్పడు రైల్లో ప్రయాణిస్తున్నారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి బ్రేకింగ్ వ్యస్థను సరిచేయడంతో రైలు  పయనం తిరిగి ఆరంభమైంది. సాంకేతిక లోపం కారణంగా సాధారణ వేగం గంటకు 40 కిలోమీటర్ల మించకుండా ప్రయాణిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ రైలును గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos