మేమంటే బీజేపీకిభయం:మాయావతి

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను అలహాబాద్ విమానాశ్రయం వద్ద అడ్డుకోవడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల్ని అడ్డుకునేందుకు తాము ఏక తాటి మీదికి రావడంతో ఆ పార్టీ వణికిపోతోందని వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీ నియంతృత్వ పాలనకు ఇదే నిదర్శనం. ఇలాంటి దురదృష్టకరమైన, అప్రజాస్వామికమైన చర్యలపై పూర్తిస్థాయిలో పోరాడతాం. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు చెక్ పెట్టేందుకు ఎస్పీ-బీఎస్పీలు జట్టుకట్టాయి. దీంతో ఆ పార్టీకి భయం పట్టుకుంది. అందుకే మా రాజకీయ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది…’’ అని పేర్కొన్నారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఓ విద్యార్ధి నేత ప్రమాణ స్వీకారానికి వెళ్తుండగా పోలీసులు తనను అడ్డుకున్నారంటూ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. పోలీసులు తనను విమానాశ్రయంలోకి తోసుకుంటూ వెనక్కి తీసుకెళ్తున్న ఫోటోలను కూడా ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos