ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి, ఆయన సోదరుడు రఘునాధ్‌రెడ్డి వైసీపీలోకి వస్తుండటంతో వైసీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆయన మౌనంగా ఈ విషయాలను గమనిస్తూ భవిష్యత్ ప్రణాళికపై ఆరా తీస్తున్నారు. ఏదేమైనా మేడా కుటుంబీకుల రాకను ఆయన స్వాగతిస్తూనే తనకే ఎమ్మెల్యే టికెట్టు వస్తుం దన్న ధీమాతో ఉన్నారు. మేడా సోదరులు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో లోటస్‌పాండ్‌లో భేటీ అయిన సమయంలో ఆయన రాజంపేటలోని తన ఆకేపాటి భవన్‌లోనే ఉన్నారు. అంతకు మునుపు మేడా సోదరులు జగన్‌ను కలుస్తారన్న విషయం తెలిసి కూడా వైసీపీ కార్యక్రమాల్లో మంగళవారం పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న తరువాత పలువురు ఆయనను కలిసి మేడా సోదరుల రాకపై చర్చించినా ఇది సాధారణ విషయంగా భావించి తన రోజూవారి కార్యక్రమాల్లో భాగంగా వేరే గ్రామంలో జరిగే కార్యక్రమానికి వెళ్లారు. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడైన ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి వైసీపీకి ఒక ఫౌండర్ అని చెప్పాలి. వైసీపీ పార్టీ ఆరంభించే సమయంలో జగన్‌కు తోడుగా ఉన్న నాయకుల్లో అగ్రభాగాన నిలిచేది అమర్‌నాథ్‌రెడ్డే.. ఈ విషయాన్ని ఆపదలో ఉన్నప్పుడు తాను వైసీపీ పార్టీ పెట్టేటప్పుడు ఎమ్మెల్యే పదవులు సైతం తెజించి నా వెంబడి ఉన్నది అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డేనని పలు మార్లు జగన్ స్వయంగా వెల్లడించి ఉన్నారు. ఇదే విధంగా వైసీపీ సమావేశాల్లో అమర్‌నాథ్‌రెడ్డి పాత్ర కీలకమైంది. కావున మేడా చేరిక వల్ల తనకు ఏ మాత్రం నష్టం జరగదని, పార్టీకి మంచి జరిగే జగన్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్న రీతిలో అమర్‌నాథ్‌రెడ్డి ఎంతో ధీమాతో ఉన్నారు. తనకు ఎంతో విలువ నిచ్చే జగన్ పట్ల ఆయన విధేయత చూపుతూ ఎటువంటి ప్రకటనలు చేయకుండా గప్‌చుప్‌గా పార్టీ కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీకి బూత్ కన్వీనర్లు పట్టుకొమ్మలుమండల కేంద్రంలోని స్థానిక హరిత హోటల్‌లో మంగళవారం ఉదయం మండలంలోని వైకాపా శ్రేణులతో, బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బూత్ కన్వీనర్లే పార్టీకి మూలస్తంభాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని, పార్టీలోకి ఎవ్వరు వచ్చినా ఆహ్వానిస్తానని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం తధ్యమన్నారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల నాయకులు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తేలూరు శేషారెడ్డి, సిగె భాస్కర్‌రెడ్డి, జాకీర్ హుస్సేన్, హబీబుల్లా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.