మిర్వాయిజ్ నిర్బంధం. మోదీ పర్యటనకు ముందే..

మిర్వాయిజ్  నిర్బంధం. మోదీ పర్యటనకు ముందే..

శ్రీనగర్: మితావాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు గృహ నిర్బంధం విధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకే మిర్వాయిజ్‌ను హౌస్ అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వేర్పాటు వాదులు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా మిర్వాయిజ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీనగర్‌లోని నిగీన్ ప్రాంతంలో ఉన్న మిర్వాయిజ్ నివాసం వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందంటూ మిర్వాయిజ్ ట్విటర్లో ఆరోపించారు. ‘‘నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం పానిక్ బటన్లు నొక్కేసింది. నియంత్రణ కఠినతరం చేసింది. లాల్ చౌక్‌లో సైతం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి నన్ను హౌస్ అరెస్ట్‌లో ఉంచారు..’’ అని మిర్వాయిజ్ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని మొత్తం మూడు ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos