మావోయిస్టు సుధాకర్‌ లొంగుబాటు

హైదరాబాద్‌: మావోయిస్టు సుధాకర్‌, ఆయన భార్య నీలిమ పోలీసుల ఎదుటలొంగి నట్లు   తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిబుధవారం ఇక్కడ వెల్లడించారు. ఏడాదిగా సుధాకర్‌ లొంగిపోయేందుకు యత్నిస్తున్నారని డీజీపీ చెప్పారు. సుధాకర్‌ అలియాస్‌ సత్వాజీ స్వస్థలం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌. ఇంటర్‌ లో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ విధానాలకు ఆకర్షితులై . కటకం సుదర్శన్‌ ప్రోద్బలంతో ఆ పార్టిలో చేరారని చెప్పారు. తొలుత మారణాయుధాల సాంకేతిక సమితిలో , తర్వాత బెంగళూరు కేంద్రంగా  పనిచేశారని వివరించారు. పోలీసులు1986లో సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని..1989లో జైలు నుంచి విడుదలయ్యాక రైతు కూలీ సంఘంలో పనిచేశారని చెప్పారు. . 1990 నుంచి ఇప్పటి వరకు  వివిధ హోదాల్లో కార్యక్రమాలు నిర్వహించారని విశదీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos