మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

Maoist camp busted explosives seized in Odisha

ఒడిశా : నౌపడా జిల్లా పట్‌దారా అటవీప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయంతో అక్టోపస్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు పరారీ అయ్యారు. మెయిన్‌పూర్‌ – నౌపడా డివిజన్‌ సీపీఐ మావోయిస్టులకు చెందిన క్యాంపస్‌పై పోలీసులు దాడి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పట్‌ధార్‌ రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన బలగాలు మావోయిస్టుల క్యాంపుపై దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తానికి మావోయిస్టులు పరారీ కావడంతో.. అక్కడున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐదు టిఫిన్‌ బాంబులు, మూడు యూపీఎస్‌ బ్యాటరీలు, రెండు కేజీల గన్‌ పౌడర్‌, విద్యుత్‌ తీగలు, దుస్తులు, ఎర్ర జెండాలతో పాటు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos