మహేష్ సంప్రదించలేదన్న కత్రిన!

  • In Film
  • January 31, 2019
  • 952 Views
మహేష్ సంప్రదించలేదన్న కత్రిన!

మహేష్ హీరోగా నటిస్తున్న `మహర్షి` ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కి అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మహేష్ రెడీ అవుతున్నారు. సేమ్ టైమ్ అతడు నటించనున్న 26వ సినిమాకి సంబంధించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే మహేష్ కి ఫైనల్ వెర్షన్ స్క్రిప్టును వినిపించేందుకు అతడు సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మహర్షి షూటింగ్ పూర్తవ్వగానే సుకుమార్ సినిమాపై మహేష్ పూర్తిగా దృష్టి సారించనున్నారు. జూన్ – జులైలో ఈ సినిమాని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోందిట. మహేష్ సరసన బాలీవుడ్ అందగత్తె కత్రిన కైఫ్ కథానాయికగా ఫైనల్ అయ్యిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ కత్రినను సంప్రదించారని మహేష్ 26కి అధికారికంగా ఫైనల్ చేసేశారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కత్రిన ఓ ప్రకటనలో క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేశారు. “ప్రస్తుతం `భరత్` అనే చిత్రం తప్ప వేరొక సినిమాకి కమిటవ్వలేదు. నన్ను ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదు“ అని కత్రిన తెలిపారు. దీంతో ఇప్పటివరకూ వచ్చినవన్నీ రూమర్లు అని తేలిపోయింది.మహేష్ 26 కోసం ఓ బాలీవుడ్ నాయికను ఎంపిక చేయాలనుకుంటే కత్రిన మాత్రమే ఆప్షన్ కాదు. నవతరం నాయికల్లో దూసుకొస్తున్న పలువురికి సుకుమార్ & టీమ్ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో పాత పడిపోయిన ముఖాల్ని మన దర్శకులు ఎంపిక చేస్తే చూసే ఆడియెన్ కి బోర్ తప్పదు. ప్రతిష్ఠాత్మక ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి రాజమౌళి కొత్త ముఖాల్ని పరిచయం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆలియా లాంటి యంగ్ బ్యూటీని దిగుమతి చేసే పనిలో రాజమౌళి ఉన్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అందుకే లెక్కల మాస్టార్ సైతం మహేష్ 26 కథానాయిక ఎంపికలో ఇలా లాజిక్ వెతుకుతారనే భావిస్తున్నారు ఫ్యాన్స్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos