సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పాత్ర ఈ చిత్రంలోమూడు కోణాల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే కార్పొరేట్ సంస్థ అధినేతగా మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడట. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో మహేష్ ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీమంతుడు చిత్రాల్లో మహేష్ కోటీశ్వరుడి కుమారుడిగా నటించిన సంగతి తెలిసిందే. మహర్షి చిత్ర షూటింగ్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిత్రీకరణ ఆఖరిదశలో..
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీఅంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు యూఎస్ లో ఉండే కార్పొరేట్ అధినేతగా ఇండియాకు వస్తాడు. ఇక్కడ సమస్యల్లో ఉన్న రైతులకు సాయం అందిస్తాడు. ఈ చిత్రానికి సంబందించిన పల్లెటూరి సన్నివేశాలు కొన్ని దర్శకుడు పొల్లాచ్చిలో తెరకెక్కించాడు. తాజాగా పొలాచ్చి షెడ్యూల్ పూర్తయింది. దీనితో మహర్షి చిత్రీకరణ ఆఖరిదశకు చేరుకున్నట్లు అయింది.
ఫోటోలు లీక్..
పొల్లాచ్చి షెడ్యూల్ లో షూటింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. మహేష్ బాబు ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న ఓ ఫోటో అయితే అభిమానులని విపరీతంగా ఆకర్షిస్తోంది. భరత్ అనే నేను చిత్రంలో ప్రెస్ మీట్ సన్నివేశం హైలైట్ గా నిలిచినది. ఈ చిత్రంలో మహేష్ బాబు రైతు సమస్యల గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూజాహెగ్డే హీరోయిన్..
ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుమీద ఉన్నా హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత లాంటి క్రేజీ చిత్రాల్లో నటించిన పూజ ప్రస్తుతం మహెష్ సరసన మహర్షి చిత్రంలో, ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శత్వం వహించే చిత్రంలో అవకాశం అందుకుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు.