మహేష్‌‌బాబు క్రేజ్ అంటే అదీ.

  • In Film
  • January 19, 2019
  • 188 Views
మహేష్‌‌బాబు క్రేజ్ అంటే అదీ.

గతేడాది రిలీజైన భరత్ అనే నేను సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా మహేష్ బాక్సాఫీస్ సత్తాను చాటిచెప్పింది. అంతేకాకుండా ఓవర్సీస్, హిందీ, డిజిటల్స్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం అప్పట్లో సెన్సేషన్‌గా మారింది. ఇటీవల భరత్ అనే నేను మూవీని హిందీలోకి డబ్ చేసి టెలివిజన్‌లో ప్రసారం చేయగా రికార్డు స్థాయి రేటింగ్ నమోదైంది. వివరాల్లోకి వెళితే..
హిందీలో మహేష్ బాబు మార్కెట్..
తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ కావడం టాలీవుడ్ పరిశ్రమకు అదనపు రాబడిని పెంచింది. హిందీ మార్కెట్‌లో మహేష్ బాబు సినిమాలకు మంచి డిమాండ్ ఉంటున్నది. టక్కరి దొంగ, నిజం లాంటి చిత్రాలకు టెలివిజన్‌లో మంచి రేటింగ్స్ రావడం సినీ విమర్శకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
భరత్ అనే నేను హిందీ శాటిలైట్ హక్కులు హిందీ మార్కెట్‌లో మహేష్ బాబు చిత్రాలకు డిమాండ్ పెరగడంతో భరత్ అనే నేను శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా హక్కులను రూ.22 కోట్లు వెచ్చించి జాతీయ టెలివిజన్ చానెల్ సొంతం చేసుకొన్నది. మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది రికార్డు బిజినెస్‌గా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
భరత్ అనే నేను ప్రీమియర్‌కు రికార్డు స్థాయిలో..
ఇటీవల ప్రదర్శించిన భరత్ అనే నేను మూవీ హిందీ వెర్షన్‌ ప్రీమియర్‌‌కు అనూహ్యమైన స్పందన వ్యక్తమైనట్టు సమాచారం. భరత్ అనే నేను సినిమాకు వచ్చిన టెలివిజన్ రేటింగ్ గతేడాదిలోనే టాప్‌గా నిలిచి రికార్డును సొంతం చేసుకొన్నది.
మహర్షి మూవీపై భారీ అంచనాలు..
భరత్ అనే నేను ప్రీమియర్‌కు మంచి టీఆర్సీ రావడంతో మహర్షి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మహర్షి హిందీ శాటిలైట్ హక్కులకు కూడా భారీ రేటు పలికే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos