రాయ్‌పూర్ : . ప్రతిపక్షాల మహాకూటమిపై మోదీ విరుచుకుపడ్డారు. అది మహాకూటమి కాదని, మహా కల్తీ అని మండిపడ్డారు. దీనిని నమ్మవద్దని, తమను తాము రక్షించుకోవాలని ప్రజలను కోరారు.
. రాయ్‌గఢ్ జిల్లా కొడతరాయ్‌లోశుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రుణాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కేవలం సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాత్రమే రద్దు చేశారన్నారు. జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మాట ఏమిటని ప్రశ్నించారు. వారు రుణాల రద్దుకు అర్హులు కారా? అని నిలదీశారు. రుణాల రద్దు విధానాన్ని ప్రజలకు కాంగ్రెస్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ, ఇది మోసమని చెప్పారు. కాంగ్రెస్ పదేళ్ళకోసారి ఎన్నికల ప్రయోజనాల కోసం రుణాల రద్దు హామీని ఇస్తూ ఉంటుందన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో నరేంద్ర మోదీపర్యటించారు. కాంగ్రెస్ అగ్ర నేతల్లో చాలా మంది చట్టపరమైన చిక్కుల్లో ఉన్నారని ఆరోపించారు. . ‘‘(గాంధీ) కుటుంబంలోని అత్యధికులు
చట్టపరమైన చిక్కుల్లో – బెయిలుపై కానీ, ముందస్తు బెయిలుపై కానీ ఉన్నారు.’’ అని మోదీ చెప్పారు.