ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మళ్లీ ఎన్నికల బరిలోకి
దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన 2012లో ప్రకటించటం
తెలిసిందే. “నాకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశ
లేదు. పార్టీ నేతలు కొందరు మళ్ళీపోటీ చేయాలని కోరుతున్నారని” ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.దరిమిలా
ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
చేస్తారా? లేదానే విషయంపై నెలకొన్న సందిగ్ధత తొలగింది. ఇటీవల
జరిగిన పార్టీ ప్రముఖుల సమావేశం ఆయనను మళ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించింది. మహారాష్ట్రలోని మాధా లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీకి చేయవచ్చని తెలిసింది. 2009లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి విజయాన్ని సాధించారు. అనంతరం ఎన్నికల బరిలోకి దిగనని ప్రకటించడంతో గత
ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఎన్సీపీ
అభ్యర్థి విజయసింహా మోహిత్ పాటిల్ గెలుపొందారు.పలువురు ఎస్సీపీ నేతలు ఇటీవల
ఒకసమావేశాన్ని నిర్వహించి
మాధా నియోజక వర్గం నుంచి శరద్ పవార్ పోటీ కి దింపాలనని
తీర్మానించటంతో మోహిత్ పాటిల్ అసంతృప్తి ని వ్యక్తీకరించారు. చివరకు ఆయనకు నేతలు నచ్చచెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎస్సీపీ ఎన్నికల బరిలోకి దిగనుంది.