లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెలికాఫ్టర్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో… మరో మార్గంలో అక్కడికి వెళ్లేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఇవాళ బీజేపీ నిర్వహించనున్న ర్యాలీకి ఆయన రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. హెలికాఫ్టర్‌లో తొలుత జార్ఖండ్‌లోని బొకారోలో దిగి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. యూపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన పురులియా బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన ఈ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. వాస్తవానికి బీజేపీ షెడ్యూల్ ప్రకారం యోగి ఈ నెల 3న దీనజ్‌పూర్ జిల్లా రాయ్గంజ్లోనూ, దక్షిణ దీనజ్‌పూర్ జిల్లా బలుర్ఘాట్లోనూ జరిగే రెండు ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే మమత ప్రభుత్వం ఆయన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంతో… తన ప్రయాణాన్ని విరమించుకున్నారు. దీంతో ఆ రోజు రాయ్‌గంజ్ ర్యాలీలో టెలీఫోన్ ద్వారా యోగి ప్రసంగించారు.