మమత బెనర్జీ తన గొయ్యి తానే తవ్వుకున్నారు : విప్లవ్ దేవ్

మమత బెనర్జీ తన గొయ్యి తానే తవ్వుకున్నారు : విప్లవ్ దేవ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై త్రిపుర ముఖ్యమంత్రి, బీజేపీ నేత విప్లవ్ దేవ్ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి, హింసలకు అవకాశం ఇచ్చి, మమత తన గొయ్యి తానే తవ్వుకున్నారని దుయ్యబట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ పేరుతో హుగ్లీ జిల్లాలోని ఆరాంబాగ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘మీ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కొడుకుల కళ్ళెదుటే తల్లులను చంపుతూ ఉంటే, మీరు ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారు. మీ రాష్ట్రంలో హింసకు, అవినీతికి ఆస్కారమివ్వడంతో మీ గొయ్యిని మీరే తవ్వుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మీ కౌరవ పార్టీని ఓడిస్తారు. అంతిమంగా మహాభారత యుద్ధం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పాండవులకు విజయం దక్కుతుంది’’ అని విప్లవ్ దేవ్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos