కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీని దుర్గామాతగా అభివర్ణిస్తూ లక్నోలోని జాతీయ పునరావాస యూనవర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ శకుంతలా మిశ్రా ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టు పెట్టారు.మమతను మహిషాసుర మర్దినిగా పోల్పారు. దుర్గాదేవిని పోలి ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ మాత్రమేనని మరో హిందీ ప్రొఫెసర్ డాక్టర్ దేవేంద్ర నాథ్ సింగ్ ఫేస్‌బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. నాడు అటల్ బిహారీ వాజ్ పేయి ఇందిరాగాంధీని దుర్గాగా పోల్చారని, కాని అసలు దుర్గా మమతానేనని ప్రొఫెసర్ పేర్కొన్నారు. సీబీఐ – కోల్‌కతా పోలీసుల వివాదం నేపథ్యంలో ప్రొఫెసర్లు ఈ వ్యాఖ్యలు చేశారు.