ముంబై : దేశీయ
స్టాక్ మార్కెట్లు గురువారం మందకొడిగా ప్రారంభ
మయ్యాయి. స్పల్ప లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు స్వల్ప వ్యవధిలోనే నష్టాల్లోకి
దిగ జారాయి. ఉదయం
10.08 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 35,729 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల
లాభంతో 10,741 వద్ద ట్రేడయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ఒక శాతం లాభాలతో ట్రేడయ్యాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనంగా రూ.48,239 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం బుధవారం అంగీకరించిన
పరిణామం ఇది. అలహాబాద్ బ్యాంక్ , కార్పొరేషన్ బ్యాంక్‌లకు ఎక్కువగా సాయం అందనుంది.
దరిమిలా ఆ బ్యాంకులు ఆర్‌బీఐ పీసీఏ ఆంక్షల నుంచి బయటపడనున్నాయి. కార్పోరేషన్ బ్యాంక్
షేర్లు ఒక దశలో 15.48శాతం లాభాల్లో ట్రేడ య్యాయి.
పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఐవోబీ, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్,
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ లతోపాటు కోటక్ బ్యాంకులు లాభపడు తున్నాయి. గెయిల్,
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్,సన్‌ఫార్మ, అల్ట్రా టెక్ సిమెంట్, ఓఎన్‌జీసీ టాప్
విన్నర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్,
భారతి ఇన్‌ఫ్రాటెల్ వోడాఫోన్, యస్ బ్యాంకు నష్టపోతున్నాయి. రూపాయి నేడు 4పైసలు బలపడి
71.07 వద్ద ట్రేడవుతోంది