భర్త మృతదేహం చూసి విరగబడి నవ్విన భార్య!

  • In Crime
  • February 2, 2019
  • 916 Views

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య తన భర్తను కడతేర్చిన దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో జరిగింది. అర్ధవీడు మండలంలోని నాగుల వరం గ్రామానికి చెందిన రజనీ, జగన్మోహన్ రెడ్డి భార్యభార్తలు. డాక్టర్ వెంకటనారాయణ కంభంలో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. రజనీ దంపతులు ఆయన కస్టమర్లు. ఈ క్రమంలో రజనీ, వెంకటనారాయణ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన వెంకటనారాయణ, రజనీ సహకారంతో ఆయన హత్యకు పథకం వేశాడు. ఈ నేపథ్యంలో వెంకటనారాయణను హతమార్చే నిమిత్తం కిరాయి హంతకులతో పదిలక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఆత్మకూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం సంఘటన స్థలానికి రజనీని పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న తన భర్త మృతదేహం చూసి రజనీ నవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని రజనీ బహిర్గతం చేసింది. కాగా,  కంభంలో డాక్టర్ గా ఉన్న వెంకటనారాయణ, గిద్దలూరులో జనసేన నాయకుడిగా ఉన్నట్టు సమాచారం. వెంకటనారాయణకు గతంలో కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం తెలుసుకున్న సదరు మహిళ బంధువులు ఆయనకు దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos