బ్యాంకుల చీఫ్‌లతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

  • In Money
  • January 29, 2019
  • 940 Views
బ్యాంకుల చీఫ్‌లతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరగున్న తదుపరి మానిటరీ పాలసీ సమీక్షకు ముందు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకులతో సమావేశమయ్యారు. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి కోరుకుంటుందన్నది వారికి ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ తన చివరి ద్వైమాసిక పాలసీ సమీక్షను ఫిబ్రవరి 7న ప్రకటించనుంది.‘‘బ్యాంకింగ్‌ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి ఆశిస్తుందో వారికి తెలియజేయడం, బ్యాంకింగ్‌ రంగ పరిస్థితులపై వారి అవగాహనను తెలుసుకోవడం, అలాగే, భవిష్యత్తుపై అవగాహన కోసమే భేటీ జరిగింది’’ అని పీఎస్‌యూ బ్యాంకుల సీఈవోలతో భేటీ తర్వాత శక్తికాంత దాస్‌ మీడియాకు తెలిపారు. రానున్న ఎంపీసీ భేటీలో కీలక రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos