బోయపాటిని దెబ్బ తీసింది ఇదేనా!

  • In Film
  • February 1, 2019
  • 194 Views
బోయపాటిని దెబ్బ తీసింది ఇదేనా!

ఇంతకు ముందు ఒక లెక్క వినయ విధేయ  రామ వచ్చాక ఒక లెక్క అన్నట్టు తయారయ్యింది బోయపాటి శీను పరిస్థితి. కథ ఎంత నేల విడిచి సాము చేసినా ఏదో ఒకరకంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇప్పటిదాకా సక్సెస్ అవుతూ వచ్చిన శీనుకి చరణ్ సినిమా ఇచ్చిన ఝలక్ చిన్నది కాదు. కెప్టెన్ తనే కాబట్టి అందరి కంటే ఎక్కువ నిందలు శీనునే మోయాల్సి వస్తోంది. అయితే తన మేకింగ్ స్టైల్ మీద కొత్తగా చర్చ మొదలైంది. దీని వల్లే కొంత ప్రభావం చెంది ఉండవచ్చని కొందరి వెర్షన్. దాని ప్రకారం బోయపాటి శీనుకు సెట్ లో ఎప్పుడూ ఎంచుకున్న ఆర్టిస్టులందరూ ఉండి తీరాలట. ఆ రోజు వాళ్ళకు సీన్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉండి తీరాలనే కండిషన్ మీదే కాల్ షీట్స్ తీసుకుంటాడని ఇప్పటికే టాక్ ఉంది.

అయితే ఎందుకిలా చేస్తాడు అనే అనుమానం రావొచ్చు. మూడ్ ని బట్టి అప్పటికప్పుడు ఏ సీన్ తీయాలో డిసైడ్ చేసుకుని స్పాట్ లోనే వాళ్ళకు మొత్తం వివరించి తీసేస్తాడట. అందుకే వినయ విధేయ రామలో చాలా సన్నివేశాల్లో కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వాళ్ళ వెర్షన్. అయితే వీటిలో నిజమెంతుందో కాని శీను ఇకపై స్క్రిప్ట్ ల విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం. భారీ తారాగణం పేరిట వనరులు వృధా చేయడం కంటే కథనం మీద ఫోకస్ పెడితే రికార్డులు బద్దలు కొట్టొచ్చు.అసలు వినయ విధేయ రామలో నలుగురు అన్నయ్యలు ఎందుకు ఉన్నారో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు. ఆర్యన్ రాజేష్-రవి వర్మ-మధు నందన్ ఉత్తినే డమ్మీలుగా మారిపోయారు. ఒక్క జీన్స్ ప్రశాంత్  పాత్రకు మాత్రమే కథలో లింక్ ఉంది. అలాంటప్పుడు తెరమీద నిండుగా కనిపించాలనే యావ తప్ప కథ డిమాండ్ వల్ల ఇంతమందిని తీసుకోలేదని  అర్థమవుతుంది. సో శీను ఇది కాస్త సీరియస్ గా తీసుకుని ఎక్కువ మంది ఉండాలి సెట్స్ కి అందరూ రావాలి లాంటివి పక్కన పెడితే మంచి ఫలితాలు వచ్చేలా ఉన్నాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos