ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్లు

  • In Money
  • January 16, 2019
  • 1062 Views

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూలతలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 3 పాయింట్ల లాభంతో 36,321కు పెరిగింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,890 వద్ద స్థిరపడింది. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, హచ్సీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో కార్ప్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ తదితర కంపెనీలు లాభపడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos