ముంబయి: దేశీయ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఈ పరిణామాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కీలక రంగాల షేర్లలో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. నేటి సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించిన సూచీలు ప్రస్తుతం లాభనష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 12 పాయింట్ల లాభంతో 36,121 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 10,829 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.27గా కొనసాగుతోంది. ఆటోమొబైల్, ఐటీ, లోహ రంగాల షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.