ఫిబ్రవరి20న శాంసంగ్‌ బిగ్‌ ఈవెంట్‌

  • In Money
  • January 11, 2019
  • 1056 Views
ఫిబ్రవరి20న శాంసంగ్‌ బిగ్‌ ఈవెంట్‌

సౌత్‌ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు మరోసారి మార్కెట్లో వ్యాపించాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫో‍ల్డబుల్‌ ఫోన్‌ను ఇటీవల ప్రదర్శించిన శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరిలో ఆవిష్కరించనుందని భావిస్తున్నారు.ముఖ్యంగా ఫిబ్రవరి 20 ఉదయం 11 గంటలకు శాన్ఫ్రాన్సిస్కో లోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియంలో స్పెషల్‌ ఈవెంట్‌ వుందంటూ శాంసంగ్‌ మీడియా ఆహ్వానాలు పంపింది. ఈ సందర‍్భంగా శాంసంగ్‌ ఎస్‌ 10, ఎస్‌10లైట్‌, ఎస్‌ 10 ప్లస్‌ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను తీసుకురానుందని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ (గెలాక్సీఎఫ్‌) తోపాటు 5జీ డివైస్‌ను కూడా లాంచ్‌ చేయనుందట. ఎస్‌9కి కొనసాగింపుగానేమాత్రమే కాకుండా గెలాక్సీ ఫోన్ల 10వ వార్షికోత్సవంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది.
ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలపై అనేక అంచనాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి. ఎస్‌ 10 129 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 60వేలు , ఎస్‌10 లైట్‌ ధర రూ.72వేలు, ఎస్‌10 ప్లస్‌ ధర రూ.81 వేలు హై ఎండ్‌ వెర్షన్‌ ధర దాదాపు లక్ష,27వేల రూపాయలుగా ఉండనుందని అంచనా.
గెలాక్సీ ఎస్‌ 10 ఫీచర్లు
6.1అంగుళాల ఇన్ఫినిటీ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9.0
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
3500 ఎంఏహెచ్‌బ్యాటరీ
అలాగే గెలాక్సీ లైట్ ‘లైట్’ వెర్షన్ ఎస్‌10 5.8 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్‌తో రానుంది. గెలాక్సీ ఎస్‌ 10 ఫోన్‌ను 6.1 అంగుళాల స్క్రీన్, ఎస్‌10 ప్లస్‌ను 6.4 అంగుళాల డిస్‌ప్లేతో రూపొందించింది. అయితే ఫ్రంట్‌, రియర్‌ కెమెరా స్పెసిఫికేషన్స్‌పై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos