న్యూఢిల్లీ : ప్రేమికుల రోజు వ్యతిరేకుల బారి నుంచి తప్పించుకునేందుకు
ప్రేమ పక్షులకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చిట్కా బోధించారు. సంఘ్ పరివార్ కుర్రాళ్లు మిమ్మల్ని బెదిరించడానికి
ప్రయత్నిస్తే, ప్రాచీన భారతీయ సంప్రదాయమైన కామదేవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పండి’’ అని గురువారం ట్వీట్ చేసారు. ప్రేమికుల దినోత్సవం అంటే భారతీయ సంప్రదాయ ఉత్సవమని అభివర్ణించారు