ప్రియుడిని నమ్మి అతడి ఇంటికి వెళ్లిన బాలికను ఓ యువకుడు నాలుగు రోజులపాటు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక(17), సరూర్‌నగర్ గుర్రంగూడ ప్రాంతంలో నివసించే బొల్లు సాయిగణే్‌షదాస్(23) ప్రేమించుకుంటున్నారు. ఏ లోటు రాకుండా చూసుకుంటానని ఆమెను నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లాడు. కుమార్తె కనిపించడం లేదంటూ ఈనెల 1వ తేదీన బాలిక తల్లిదండ్రులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ ఆధారంగా వారు ఎక్కడున్నారో గుర్తించారు.ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా సాయిగణే్‌షదాస్ గదిలో బంధించి అత్యాచారం చేసినట్టు తేలింది. నిందితుడిపై పలు సెక్షన్‌లతోపాటు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.