ప్రశాంత్ భూషణ్ కు”సుప్రీం” ధిక్కార నోటీసులు

సామాజిక కార్యకర్త న్యాయవాది, ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కార నోటీసులను సుప్రీంకోర్టు పంపింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం.నాగేశ్వరరావు నియామకంపై ట్విట్టర్ ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ… సుప్రీంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వేసిన పిటషన్ ను విచారించిన కోర్టు నోటీసులను జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ద్విసభ్య ధరా్ర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన అంశాలపై లాయర్లు , ఇతరులు కానీ బహిరంగంగా విమర్శలు గుప్పించడం… ప్రజలపై ప్రభావం చూపుతుందని గా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను విమర్శించడం… న్యాయవ్యవస్థలో తలదూర్చడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో వాదనలను వింటామని తెలిపింది. మార్చి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos