వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఐక్యరాజ్య సమితి మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ పోటీపడుతున్నారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి యూఎస్ నామినీ కోసం అంతర్గత సమీక్షలను ప్రారంభించామని, గవర్నర్లతో చర్చించిన అనంతరం కొత్త ప్రెసిడెంట్‌ను ప్రకటించనున్నట్లు ప్రపంచ బ్యాంక్‌కు చెందిన ఉన్నతాధికారవర్గాలు వెల్లడించినట్లు ది ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు జిమ్ యోంగ్ కిమ్ గత వారం ప్రకటించారు.