పోలీసు శాఖలో ఎన్నికల సందడి

పోలీసుశాఖలో ఎన్నికల సందడి మొదలయ్యింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఆ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని గుంటూరు అర్బన్‌, గుంటూరు రూరల్‌కు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. ఎంపికైన సంఘం రెండురేళ్లు వరకు తమ సేవలందించవచ్చు. గుంటూరు జిల్లాలో పోలీసు అధికారుల సంఘం కాలపరిమితి ముగిసి సుమారు రెండున్నరేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆదేశాలు జారీ చేయకపోవడంతో పాత కమిటీలే కొనసాగాయి. గతనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అనుకోని విధంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో అవి రద్దయ్యాయి. రాజకీయపార్టీల సాధారణ ఎన్నికలు జరిగే వరకు పోలీసుల ఎన్నికలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ పోలీసు ఎన్నికలకు ఆసక్తి చూపుతున్నవారిలో నెలకొంది. ఈక్రమంలో ఉన్నతాధికారులు అనూహ్యంగా ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీలోగా ఎన్నికల పర్వం ముగించాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పోలీసుశాఖలో కోలాహలం నెలకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos