పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

  • In Crime
  • January 18, 2019
  • 1047 Views
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మంచు కమ్ముకోవడంతో రోడ్డు మలుపు కనిపించక నేరుగా పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం నెల్లూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి కర్నూలు జిల్లాకు 40 మంది ప్రయాణీకులతో ఆర్‌టిసి బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో నెల్లూరుకు వచ్చేప్పటికి మంచు బాగా రోడ్డును కమ్ముకోవడంతో బస్సు డ్రైవర్‌కు రోడ్డు మలుపు కనిపించలేదు. దీంతో బస్సు అదుపుతప్పి నేరుగా పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బస్సులో ఉన్నవారిలో దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos