అమరావతి: పేదరికంలేని సమాజం కోసం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మానవ వనరులు, సంక్షేమంపై అసెంబ్లీలో ఆయన గురువారం మాట్లాడారు. తన కులం పేద కులమని, వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే తెదేపా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు.సమాజానికి పేదరికం శాపం వంటిదని చంద్రబాబు అన్నారు. ప్రపంచీకరణతో కులవృత్తుల, చేతి వృత్తులు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కులవృత్తులు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలనున్నారని, మైనార్టీలూ పేదరికంలో మగ్గుతున్నారని వివరించారు. వారిని ఆదుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.