పెళ్లికి రండి.. క్వార్టర్‌ పొందండి

పెళ్లికి రండి.. క్వార్టర్‌ పొందండి

చెన్నై : తమిళనాడు కోయంబత్తూరులో ఓ జంట విభిన్నమైన రీతిలో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది. తమ పెళ్లికి వస్తే క్వార్టర్‌ ఇస్తామంటూ పెళ్లి పత్రికలో ముద్రించారు. ఇది సోషల్‌ మీడియాలో శనివారం నుంచి వైరల్‌గా మారింది.వివాహ ఆహ్వాన పత్రికలను ఇటీవల విభిన్నమైన ఆలోచనలు, వ్యతాసమైన డిజైన్లతో తయారుచేస్తున్నారు. ఇలా ఉండగా కోయంబత్తూరులో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. ‘‘మా పెళ్లికి రండి.. వచ్చే వివాహితులకు సైడ్‌ డిష్‌తో పాటు ఒక క్వార్టర్, అవివాహితులకు రెండు క్వార్టర్‌లు అందజేస్తాం’’ అంటూ ఆహ్వానం పలికారు. అయితే ఈ ఆహ్వాన పత్రిక అసలైనదా లేదా నకిలీదా అనే విషయం తెలియలేదు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos