పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆందోళన

అమరావతి: రాష్త్ర శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం . సీపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తిరస్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేసే సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే అని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. చైర్మన్ వేదిక వద్దకు చేరుకుని నిరసించారు. సమస్యలపై చర్చించకపోతే సభకెందుకు రావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. టీ బ్రేక్‌ సమయంలో ఈ విషయంపై చర్చిద్దామని, తన చాంబర్‌కు రావాల్సిందిగా ఇంచార్జి చైర్మన్‌ చెప్పగా.. మండలిలో చర్చ జరగాల్సిందేనని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. సీపీఎస్‌ను రద్దుపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే ఉద్యోగులంతా కలిసి సార్వత్రిక సమ్మెలకు వెళ్తారని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు గురువారం ఛలో అసెంబ్లీ ఆందోళన చేసా్స్తామని ప్రకటించారు. వెంటనే స్పందించిన చైర్మన్ సంబంధిత మంత్రితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
 .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos