పిల్లల్ని కిడ్నాప్ చేసి…అవయవాలు తీసుకొని…

పిల్లల్ని కిడ్నాప్ చేసి…అవయవాలు తీసుకొని…

దొడొమా : టాంజానియా దేశంలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. టాంజానియా దేశంలోని నిజోంబీ జిల్లాలో పదిమంది పిల్లల్ని కిడ్నాప్ చేసి, వారి అవయవాలను తీసుకొని శవాలను పడేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. నిజోంబీ జిల్లాలో గత ఏడాది డిసెంబరులో పదిమంది పిల్లలు కిడ్నాప్ నకు గురయ్యారు. తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు కొందరు టాంజానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలు కిడ్నాప్ అయిన నెలరోజులకు శవాలు లభ్యమయ్యాయని, పిల్లల అవయవాలు మాయం అయ్యాయని టాంజానియా డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి ఫాస్టిన్ నిడుగుల్లీ చెప్పారు. అవయవాలను విక్రయించేందుకు ఏడేళ్ల వయసు గల పిల్లల్ని వారిళ్ల దగ్గర నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసుకువెళ్లారని మంత్రి పేర్కొన్నారు. పిల్లల మృతదేహాల్లో ప్రధాన అవయవాలతోపాటు పళ్లు కూడా తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. టాంజానియా దేశంలో ప్రతీ 1500 పిల్లల్లో ఒకరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపి వారి అవయవాలు, ఎముకలను డాక్టర్లకు విక్రయిస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొత్తం మీద ఈ ఘటనతో టాంజానియా సర్కారు అప్రమత్తమై పోలీసులతో సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos