పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ నిరసన చేపట్టారు. చివరి బడ్జెట్ సమావేశాల్లో అయినా ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపించకుండా సాయం చేయాలని కోరారు. పార్లమెంట్ ప్రవేశద్వారం వద్ద కూడా తెలుగుదేశం ఎంపీలంతా పెద్ద ఎత్తున హోదా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. మరోవైపు వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విభజన హామీల అమలు కోసం తామెంతగా పోరాడుతున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.