న్యూఢిల్లీ: భారత వాయుసేన విమానాలు రెండింటిని కూల్చి వేసి ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్
పేర్కొంటున్నట్లు తాజాగా ఓ వీడియో విడుదలైంది. పాకిస్తాన్ పదాతి దళం విడుదల చేసినట్లు
పరిగణిస్తున్న 46 సెకన్ల వీడియోలో కళ్లకు గంతలు కట్టిన ఓ వ్యక్తి
తాను భారత వాయుసేన వింగ్ కమాండర్
విక్రమ అభినందన్ అని, నా సర్వీస్ నంబర్ 27981’’ అని చెప్పాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి
ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. దీనిపై భారత్ నుంచి అధికారిక స్పందన రాలేదు. అది బూటకమని భారత వైమానిక వర్గాలు తోసి పుచ్చాయి. బుధవారం ఉదయం ఇద్దరు భారత పైలట్లను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ పదాతిదళ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించారు. గాయపడిన పైలెట్ ఒకరిని చికిత్సకు ఆస్పత్రికి
తరలించినట్ట్లు వివరించారు. మరో పైలట్ ఏ విధమైన గాయాల్లేకుండా
సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఏఎఫ్‌కి చెందిన ఓ విమానాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చివేశామనీ,మరో విమానం జమ్మూ కశ్మీర్‌లో పడిందనీ చెప్పారు.