పాక్‌లో భారత్‌ సినిమాల నిషేధం

పాక్‌లో భారత్‌ సినిమాల నిషేధం

కరాచి: పాక్‌లో భారత్‌ సినిమాల విడుదలను నిషేధించినట్లు ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్‌ చౌదరి బుధవారం ఇక్కడ ప్రకటించారు. మేడిన్‌ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎమ్‌ఆర్‌ఏ)ని ఆదేశించారు.  భారత్‌కు సంబంధించిన సమాచారం, ఇతర అన్ని వ్యవహారాల్ని చలన చిత్ర ప్రదర్శకుల సంఘం బహిష్కరించింది. దరిమిలా పాకిస్థాన్‌లో ఇక మీదట భారత్‌ సినిమాలు విడుదల కావు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌ కళాకారులతో కలిసి పని చేయ కూడదని ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. దీన్ని ఉల్లంఘించిన సంస్థను నిషేధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos