పాక్‌లో కూలిన భారత్‌ మిగ్ 21

పాక్‌లో కూలిన భారత్‌ మిగ్ 21

న్యూఢిల్లీ ‌: పాకిస్థాన్‌లో భారత్‌ యుద్ధ విమానం -మిగ్‌ 21 బైసన్‌ కూలిందని , పైలట్‌ ఒకరు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌  బుధవారం ఇక్కడ మాధ్యమ సమావేశంలో ధ్రువీకరించారు.ఆ పైలట్‌  తమ అదుపులో ఉన్నట్లు పాక్‌ చెబుతోందనా్న్నా రు. వాస్తవాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు.  భారత్‌ చేపట్టిన వాయుసేన దాడికి ప్రతిగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ బుధవారం ఉదయం దాడికి పాల్పడిందని చెప్పారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన మూడు పాక్‌ యుద్ధ విమానాలల్ని అడ్డుకొనే క్రమంలో శ్రీనగర్‌లో ఉన్న క్విక్‌ రియాక్షన్‌  టీమ్‌లోని మిగ్‌లు రంగంలోకి దిగాయి. ఫలితంగా పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌ 16 యుద్ధ విమానం ఒకటి కూలింది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ పాక్‌ భూభాగంలోకి ప్రవేశించింది . ఆ విమానంలో ఉదయం వెళ్లిన పైలట్‌ అభినందన్‌ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇప్పటికే అభినందన్‌ తమకు చిక్కినట్లు పాకిస్థాన్‌ ఒక వీడియో కూడా విడుదల చేసింది. మరోవైపు భారత పైలెట్‌లు ఇద్దరు తమ అధీనంలోఉన్నారని పాక్‌ ఓ వీడియోను విడుదల చేసింది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos