పసిడి ధర పైపైకి

  • In Money
  • January 22, 2019
  • 960 Views

దిల్లీ: నగల వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయంగా ధర తగ్గినప్పటికీ స్థానికంగా ఉన్న డిమాండ్‌తో ధర పెరుగుతోంది. ఇవాళ బులియన్‌ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాములకు రూ.125 పెరిగి రూ.33,325కు చేరింది. 99.9శాతం స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ33,325 కాగా, 99.5శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.32,175గా ఉంది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి రూ.39,850గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గినట్లు మార్కెట్‌ వర్గాల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 0.13శాతం తగ్గి 1278.9డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 0.46శాతం పడిపోయి 15.26డాలర్లుగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos