పవన్ పట్టించుకోకపోయినా పాల్ వదలట్లేదుగా

పవన్ పట్టించుకోకపోయినా పాల్ వదలట్లేదుగా

కమ్యూనిస్టులు మినహా మరే ఇతర పార్టీతో పొత్తులు ఉండవని పవన్ ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ జనసేన పార్టీ పొత్తుల వ్యవహారంపై ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ మరోసారి టీడీపీతో జట్టుకట్టే ఆలోచనలో ఉన్నారంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి. అటు బీజీపీతో పవన్ కు లోపాయికారీ ఒప్పందం ఉందనే గాసిప్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు కేఏ పాల్ కూడా యాడ్ అయ్యారు. పవన్ ను కలుపుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారీయన.తాజాగా జరిగిన ఫేస్ బుక్ లైవ్ లో పవన్ కోసం పావుగంట కేటాయించారు పాల్. పవన్ ను వచ్చి తన పార్టీలో కలిసిపొమ్మంటున్నారు. తను స్థాపించిన ప్రజాశాంతి పార్టీతో పవన్ కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికారం తమదే అంటున్నారు పాల్. పైగా ఇక్కడ ఓ కొత్త రకమైన లాజిక్ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు.ఏపీలో పవన్ కు కేవలం 5శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉందట. అదే తన విషయానికొస్తే ఎన్నికల నాటికి 2 కోట్ల ఓటు బ్యాంక్ సృష్టిస్తాడట. దీనికి తోడు పవన్ సొంతంగా పోటీచేస్తే కేవలం కాపులు మాత్రమే ఆ పార్టీకీ ఓటేస్తారట. అదే తనతో చేతులు కలిపితే కాపులతో పాటు దళితులు ఎస్సీలు కూడా ఓటేస్తారని విశ్లేషిస్తున్నాడు. సో.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చి తనలో కలిసిపోవాలంటూ పవన్ ను ఆహ్వానిస్తున్నారు కేఏ పాల్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos