పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌..

  • In Local
  • January 21, 2019
  • 999 Views
పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో 60 అడుగుల మేర నీళ్లు ఎగసిపడ్డాయి. తాడూరు మండలం మేడూరు శివారులో ఘటన జరిగింది. భారీ ఎత్తున నీరు వృథాగా పోతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఎల్లూరు నుంచి కల్వకుర్తికి భగీరథ నీరు తరలించే ప్రధాన పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో అధికారులు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. ఎగజిమ్ముతున్న నీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చి తిలకించారు. ఇలాంటి సందర్భం మళ్లీ రాదంటూ స్థానికులు ఎగబడి సెల్ఫీలు తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos