ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుంటూరు వస్తున్న సందర్భంగా వ్యక్తం చేసే నిరసనలు దేశమంతా తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు సూచించారు. అమరావతి నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆయన ఏ ముఖం పెట్టుకుని
ఇక్కడికి వస్తారని నిలదీశారు. ఇక్కడో వ్యక్తి ఆయనకు సహకరిస్తున్నాడని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. సోమవారం తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగాఎవరికి తోచిన విధంగా వారు నిరసనలు తెలపాలని సూచించారు.