నిజ పాత్రలో వైఎస్ జగన్

  • In Film
  • January 19, 2019
  • 919 Views
నిజ పాత్రలో వైఎస్ జగన్

సస్పెన్స్ వీడిపోయింది. వైఎస్ బయోపిక్ లో వైఎస్ జగన్ పాత్ర వుంటుందా? వుండదా? వుంటే కనుక ఎవరు పోషిస్తారు? ఈ పాయింట్లకు సమాధానం దొరికేసింది. వైఎస్ బయోపిక్ యాత్రలో వైఎస్ జగన్ పాత్ర కొద్ది నిమిషాల సేపు వుంటుంది. ఆ పాత్రలో ఎవరూ నటించడం లేదు. నేరుగా వైఎస్ జగన్ నే కనిపించబోతున్నారు.విషయం ఏమిటంటే, వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా ఆయన పాదయాత్ర పూర్తి చేసుకుని, అధికారం చేపట్టే వరకే వుంటుంది. ఆ తరువాత వైఎస్ మరణం వరకు సినిమా వుంటుంది. కానీ అదేదీ షూట్ చేయరు. పూర్తిగా ఒరిజినల్ ఫుటేజ్ వాడబోతున్నారు.అంటే చివరి ఇరవై నిమిషాలు పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి వుండగా తీసిన రకరకాల ఫుటేజ్ ను ఎడిట్ చేసి వాడతారన్నమాట. అదే విధంగా వైఎస్ అంతిమ సంస్కారాలు, ఆ టైమ్ లో వైఎస్ జగన్ కనిపించడం అన్నీ కూడా ఒరిజినల్ ఫుటేజ్ నుంచి తీసుకుంటారు. సినిమాలో వైఎస్ జగన్ కనిపించబోతున్నారు అన్నది ఆయన అభిమానులకు, పార్టీ జనాలకు కాస్త ఆసక్తిగానే వుంటుంది. పైగా రియల్ ఫుటేజ్ వల్ల వచ్చే ఎమోషన్ వేరుగా వుంటుంది. మొత్తంమీద యాత్ర డైరక్టర్ మహి ప్లానింగ్ బాగానే వుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos