తెలుగు రాష్ట్రాల్లో
సంచలనం సృష్టించిన ఎక్స్‌ప్రెస్ టీవీ వీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో
తనకు ఎటువంటి ప్రమేయం లేదంటూ జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి అలియాస్ మాధురి స్పష్టం
చేసారు.గురువారం రాత్రి శిఖా మీడియాతో మాట్లాడారు.జయరామ్ వ్యక్తిగత విషయాల గురించి
తనకేమి తెలియదని కంపెనీల వ్యవహారాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలపై తమ మధ్య ఎప్పుడు
చర్చ జరగలేదన్నారు.జయరామ్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఒకటిరెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నానన్నారు.జయరామ్
తనకు ఎప్పుడు ఫోన్ చేసినా వాట్సాప్ నుంచి ఫోన్ చేసి మాట్లాడేవారని వ్యక్తిగత నంబర్
నుంచి ఎప్పుడు ఫోన్ చేయలేదన్నారు.అటువంటింది హత్య జరగడానికి కొద్ది సేపటి ముందు ఇండియన్
నంబర్ నుంచి ఫోన్ చేసి అత్యవసరంగా తనకు రూ.1 కోటి కావాలని అడగడంతో తనకేమి అర్థం కాలేదన్నారు.అంతమొత్తం
ఎందుకని అడగగా తానొక వ్యక్తి వద్ద రూ.5కోట్ల వరకు అప్పు చేసానని ఇప్పుడు రుణదాతలు అప్పు
చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని అందుకే రూ.1 కోటి అత్యవసరంగా కావాలంటూ అడిగారన్నారు.ఇది
జరిగిన కొద్ది సేపటికే హత్య జరగడంతో షాక్‌కు గురయ్యానన్నారు. తన మేనమామ ఇంట్లో నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకు వెళ్లలేదని ఆమె తెలిపారు. వాళ్ల ఇంటికి చాలామంది వచ్చి వెళుతుంటారని అన్నారు.ఇదిలా ఉండగా తన భర్త హత్యలో శిఖాచౌదరిదే ప్రధాన హస్తమని
దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాకుండా తెలంగాణ
పోలీసులు జయరామ్ హత్య కేసును దర్యాప్తు చేయాలంటూ జయరామ్ భార్య కోరడంతో కేసు దర్యాప్తు
చేపట్టిన తెలంగాణ పోలీసులు దర్యాప్తును పునఃప్రారంభించారు..