నష్టాల్లో మార్కెట్లు

  • In Money
  • January 28, 2019
  • 955 Views
నష్టాల్లో  మార్కెట్లు

ముంబయి:  భారతీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.37 సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్లు నష్టపోయి 35,911 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 10,725 వద్ద ట్రేడవుతున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు భారీగా ఎగసింది. ఒక దశలో 13శాతం లాభపడింది. ఆ తర్వాత నెమ్మదిగా షేరు ధర దిగివస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17శాతం పెరిగింది. ముఖ్యంగా ముడి చమురు ధర దిగిరావడంతో రూపాయి విలువ బలపడింది. ఈ వారం దాదాపు 500 కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో టాటాపవర్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెడీఎఫ్‌ఎసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియాన్‌ ఆయిల్‌, హీరోమోటో కార్ప్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను తాత్కాలికంగా ముగించడంతో ఆసియా మార్కెట్లో ఉత్సాహం కనిపిస్తోంది. నేడు పలు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌,  దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోపక్క ముడిచమురు ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా స్పాట్‌ క్రూడ్ ఆయిల్‌ప్యూచర్‌ 32 సెంట్లు పతనమై 53.37 వద్ద ట్రేడవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos