ముంబయి: వాణిజ్య యుద్ధంలో భాగంగా తాజాగా అమెరికా – చైనా మధ్య నెలకొన్న పరిణామాలు, ఫెడ్ మీటింగ్, చమురు ధరలు వంటి కారణాలతో నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.38గంటల సమయంలో సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 35,600 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 10,647 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి. ఈ వారంలో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లో కూడా మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.జెట్ ఎయిర్‌వేస్ సంస్థ తన అప్పులను వాటాల కింద మార్చి బ్యాంకులు నామినేట్ చేసిన డైరెక్టర్లకు బోర్డులో స్థానం కల్పించాలనే అంశంపై వాటాదారుల ఆమోదాన్ని కోరింది. దీనికి ఫిబ్రవరి 21న సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చింది. దీంతో ఆ కంపెనీ షేరు మందకొడిగా ట్రేడ్ అవుతోంది.